అనంతనాగ్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రఘాతుకానికి ఒక కానిస్టేబుల్ బలయ్యాడు. అనంతనాగ్‌లో బుధవారం లాల్‌చౌక్ సమీపంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుండగా, బైక్‌పై వచ్చిన ఒక ఉగ్రవాది అతనిపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన కానిస్టేబుల్‌ను పోలీసు సిబ్బంది అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధృవీకరించారు.