వాషింగ్టన్, జూలై 22: హొర్ముజ్ జలసంధిలోని నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపిన ప్రతిసారి ఆ దేశంలోని వంతెన పైనో, విద్యుత్తు ప్లాంట్ పైనో దాడి చేసి దానిని నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ డ్రోన్ ద్వారా దాడి చేసిందా, క్షిపణి ద్వారా చేసిందా అన్నది ముఖ్యం కాదని, ఎలా దాడి చేసినా ఇరాన్ రాజధాని సమీపంలోని వంతెన, విద్యుత్తు ప్లాంట్లపై ఆమెరికా బాంబులు వేయడం, వాటిని నాశనం చేయడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై తమ దాడులు ఇంకా ముగియలేదన్నారు. అయితే ఇప్పుడు దాడులు ఆపేసినా ఈ యుద్ధం నుంచి తేరుకోవడానికి, దేశ పునర్ నిర్మాణానికి ఇరాన్‌కు 20 ఏండ్లకు పైగా సమయం పడుతుందని అన్నారు.