హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : బీటెక్ సెకండియర్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ పరీక్షను శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 95.94శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ తెలిపారు.
18,626 మంది దరఖాస్తు చేసుకోగా, 17,870 మంది పరీక్షకు హాజరైనట్టు వెల్లడించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ పరీక్షను పర్యవేక్షించారు. వారం రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని చంద్రశేఖర్ తెలిపారు.