Group 1 Preliminary Key | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన రోజు వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
గ్రూప్ 1 ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీజీఎస్సీ గడువు ఇచ్చింది. అభ్యంతరాలను పూర్తిగా ఇంగ్లీషులోనే పంపించాలని సూచించింది. ఇతర భాషలో వచ్చిన అభ్యంతరాలు, వ్యక్తిగతంగా పంపించే అభ్యంతరాలను స్వీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.