హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది.
అదే రోజున టెట్ ఇన్ఫర్మేషన్ బులిటిన్ సైతం విడుదల చేస్తారు. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 9 నుంచి హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. జూలై 28-31 మధ్యలో ఫలితాలు విడుదల చేస్తారు.