హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఉద్యోగోన్నతులు పొందిన వారంతా 2017 బ్యాచ్‌కు అధికారులే. వారికి జూనియర్ గ్రేడ్ స్కేల్ (లెవల్- 12) కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కే రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన ఐఏఎస్‌లను అదే స్థానంలో కొనసాగించనున్నారు.
ముజమ్మిల్‌ఖాన్ సెలవులో ఉండటంతో తిరిగి ఆయన రిపోర్ట్ చేసిన తర్వాత పోస్టింగ్ ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టంచేశారు. ఉద్యోగోన్నతి పొందిన ఐఏఎస్ అధికారుల వివరాలు : రిజ్వాన్ బాషా షేక్, మిక్కిలినేని మను చౌదరి, ముజామ్మిల్ ఖాన్ (సెలవులో ఉన్నారు), వెంకటేశ్ ధోత్రే, బీఎం సంతోష్, రాజర్షి షా, ప్రతీక్ జైన్, ఇలా త్రిపాఠి, స్నేహ శబరీష్, రాహుల్ శర్మ, దివాకర టీఎస్, కోట శ్రీవత్స, పీ కాత్యాయనీ దేవి, ఈవీ నర్సింహారెడ్డి.