Osmania University| ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫీజును ఈ నెల 10వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.