హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఐ-హబ్ డేటా సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మోడర్న్ మెషిన్ లెర్నింగ్’పై ఫౌండేషన్ కోర్సును ప్రకటన విడుదలైంది.
కోర్సు: మోడర్న్ మెషిన్ లెర్నింగ్ (ఆన్లైన్ విధానంలో)
ఈ కోర్సును అండర్గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం ఐఐఐటీహెచ్ నిర్వహిస్తుంది.
కోర్సు కాలవ్యవధి: 36 వారాలు
కోర్సు ప్రారంభం: 2022 జనవరి
కోర్సు ఫీజు: రూ.10,000 (అన్ని పన్నులు కలుపుకొని)
కోర్సు లక్ష్యం: ఇంజినీరింగ్ విద్యార్థుల్లో మెషిన్ లెర్నింగ్‌పై అవగాహన పెరిగేలా, వారిలోని ఆచరణాత్మక నైపుణ్యాలకు మరింత పదును పెట్టేలా కోర్సును రూపొందించారు.
అప్లికేషన్స్ డొమైన్స్ విభాగాలైన ఇమేజ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్, డేటా మైనింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లేదా స్పీచ్ ప్రాసెసింగ్ వంటి వాటిల్లో అప్లికేషన్స్‌ను మరింత సమర్థంగా వినియోగించేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది.
ఈ కోర్సులో అన్ని అంశాలపై వీడియో క్లాసులు, ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్, ప్రాజెక్ట్ వర్క్ ఉంటాయి. వీటిని ఆన్లైన్ పద్ధతిలో విద్యార్థులకు సంస్థ అందిస్తుంది.
ఈ కోర్సులో భాగంగా ఐఐఐటీ ఫ్యాకల్టీలు ఆన్లైన్ సెషన్ ద్వారా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు.
ఇండస్ట్రీ నిపుణులతో డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్లు ఏర్పాటు చేస్తారు.
ఈ కోర్సు లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్‌పై ప్రాథమిక అవగాహన ఉన్నవారు, మెషిన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి, పైథాన్/కోలాబ్ వంటి ట్రెండింగ్ ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవాలనుకునే వారు ఈ కోర్సులో బాగా రాణిస్తారు.
అర్హతలు: బీఈ/బీటెక్‌లో సీఎస్ఈ, ఐటీ, ఈఈ, ఈఈఈ తదితర బ్రాంచీల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఈ కోర్సులో చేరవచ్చు.
ఎంపిక: రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదట ప్రిపరేటరీ మాడ్యూల్ నిర్వహిస్తారు. దీనిలో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో డిసెంబర్ 15 నుంచి ప్రారంభం
దరఖాస్తుకు చివరితేదీ: డిసెంబర్ 25
ప్రిపరేటరీ మాడ్యూల్ ప్రారంభం: డిసెంబర్ 28
రెగ్యులర్ సెషన్స్ ప్రారంభం: 2022 జనవరి 8
వెబ్సైట్: https://ihubdata.iiit.ac.in/mml2022