హైదరాబాద్ : జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష ( NTSE ) ఫీజు గడువును పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులను రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రధానోపాధ్యాయులకు డిసెంబర్ 4వ తేదీ వరకు గడువు ఇచ్చారు. డిసెంబర్ 6వ తేదీ లోపు ఆన్లైన్ దరఖాస్తుల కాపీలతో పాటు ఇతర వివరాలను డీఈవో ఆఫీసుల్లో సమర్పించాలి.
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఉంది. ఈ పరీక్షలో ప్రతిభ కనబరచే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తారు.