దేశంలోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు చదవాలని ఉందా..? పరిశోధనకు నెలవులైన ఐఐఎస్సీ, ఐఐటీల్లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నారా..? అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఐఐటీల్లో సీట్లు తప్పిపోయి.. ఐఐటీల్లో చదవాలన్న కల నెరవేర్చుకోవాలనుకునే వారందరికో అపూర్వ అవకాశం. దేశవ్యాప్తంగా ఐఐటీ, ఐఐఎస్సీల్లో పీజీ, పీహెచ్డీ, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం ఏటేటా నిర్వహించే ‘జామ్’ ప్రకటన విడుదలైంది. వివరాలు సంక్షిప్తంగా…
ఏడు సబ్జెక్టుల్లో దీన్ని నిర్వహించనున్నారు. వీటిని టెస్ట్ పేపర్లుగా పిలుస్తారు. బయోటెక్నాలజీ (బీటీ), కెమిస్ట్రీ (సీవై), ఎకనామిక్స్ (ఈఎన్), జియాలజీ (జీజీ), మ్యాథమెటిక్స్ (ఎంఏ), మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్), ఫిజిక్స్ (పీహెచ్).
జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆన్లైన్ పద్ధతిలో దీన్ని నిర్వహిస్తారు.
పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో మల్టిపుల్ చాయిస్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్ (ఎంఎస్క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 30 నుంచి
చివరితేదీ: అక్టోబర్ 11
పరీక్షతేదీ: 2022 ఫిబ్రవరి 13
ఫలితాల వెల్లడి: 2022, మార్చి 22
వెబ్సైట్: https://jam.iitr.ac.ina
కేశవపంతుల వేంకటేశ్వరశర్మ