భారత నైసర్గిక విభాగాల్లో అతి తక్కువ వయసు గల నైసర్గిక భాగం? 1) ద్వీపకల్ప పీఠభూమి 2) హిమాలయాలు 3) బృహత్ మైదానం 4) తీర మైదానాలు
కింది వాటిలో సరికానిది? 1) టెరాయ్- బృహత్ మైదానంలో చిత్తడి నేలలు 2) బంగర్- కొత్త ఒండ్రు మట్టి నేలలు 3) బాబర్- శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర ప్రాంతం 4) ఖాదర్- కొత్త ఒండ్రు మట్టి నేలలు
పాలఘాట్ కనుమ ఏయే రాష్ర్టాలను కలుపుతుంది? 1) తమిళనాడు- కేరళ 2) తమిళనాడు- కర్ణాటక 3) కర్ణాటక-గోవా 4) గోవా- మహారాష్ట్ర
‘దోబ్’ అంటే ఎమిటి? 1) రెండు పర్వతాల మధ్య ఉన్న లోయ ప్రాంతం 2) రెండు పీఠభూముల మధ్య ఉన్న లోయ ప్రాంతం 3) రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం 4) పైవన్నీ
‘ డాప్ల కొండలు’ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 1) హిమాచల్‌ప్రదేశ్ 2) సిక్కిం 3) మేఘాలయ 4) అరుణాచల్‌ప్రదేశ్
కాయల్స్ అంటే ఏమిటి? 1) తీర ప్రాంత మంచి నీటి జలాశయాలు 2) కేరళలోని ప్రధాన జల మార్గాలు 3) తీర ప్రాంత నిశ్చల జలాలు 4) ఏదీకాదు
దేశంలో ‘అక్టోబర్ హీట్’ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంది? 1) బీహార్ మైదానం 2) పంజాబ్ మైదానం 3) రాజస్థాన్ మైదానం 4) బెంగాల్ మైదానం
అక్టోబర్ హీట్‌కు కారణం? 1) బెంగాల్ మైదాన ప్రాంతాల్లో వాతావరణంలో అధిక ఆర్ధ్రత ఉండటం 2) పొడి, వేడి వాతావరణం ఉండటం 3) పవనాల వేగం తక్కువగా ఉండటం 4) గంగా-సింధూ మైదానాల్లోని అల్పపీడన వ్యవస్థలు
నైరుతి రుతుపవన కాలంలో తమిళనాడులో పొడిగా ఉండటానికి కారణం? 1) పశ్చిమ కనుమల పర్వత పరాన్ముఖ దిశలో ఉండటం 2) రుతుపవన గాలులు తమిళనాడు భూభాగం చేరేసరికి అవి పొడిగా మారడం 3) బంగాళాఖాత రుతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం 4) పైవన్నీ
భారత్‌లో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందినది? 1) చక్రవాత 2) సంవహన 3) పర్వతీయ 4) ఏదీకాదు
కాలబైశాఖీల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది? 1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్ 3) అషక్షం 4) పశ్చిమ బెంగాల్
నైరుతి, ఈశాన్య రుతుపవనాల రెండింటి నుంచి వర్షపాతం పొందే ప్రాంతం? 1) కశ్మీర్‌లోయ 2) కావేరి నదీలోయ 3) నర్మదాలోయ 4) కోరమండల్ తీరం
దేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని అక్రమించాయి? 1) తేమతో కూడిన సమశీతోష్ణమం డల పర్వత ప్రాంత అరణ్యాలు 2) ఉప ఉష్ణమండల అనార్థ్ర సతత హరితాలు 3) ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు 4) ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన సతతహరితాలు
‘జిమ్‌కార్బెట్ జాతీయ పార్క్’ ఏ రాష్ట్రంలో ఉంది? 1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాంచల్ 3) అస్సాం 4) అరుణాచల్‌ప్రదేశ్
సుగంధద్రవ్యాల్లో వాడే ఆల్పైన్ జాతి ‘బ్రహ్మకమలం’ ఏ ప్రాంతంలో పెరుగుతుంది? 1) పశ్చిమ హిమాలయాలు 2) కేరళ కొండలు 3) తూర్పు హిమాలయాలు 4) గంగా మైదానం
దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్? 1) సుందర్బన్ 2) గల్ఫ్ ఆఫ్ మన్నార్ 3) కాంచన జంగా 4) నీలగిరి
కింది నదుల్లో హిమాలయాల కంటే ప్రాచీనమైన నది? 1) బ్రహ్మపుత్ర 2) గంగ 3) యమున 4) గోదావరి