Study Abroad | విదేశీ చదువులకు వెళ్తున్న వారిలో మిడిల్ క్లాస్ విద్యార్థులే ఎక్కువ.. అందులోనూ అమ్మాయిలే టాప్!
Study Abroad | విదేశీ చదువులంటే గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. పేద,మధ్య తరగతి వాళ్లు ఆ దిశలో ఆలోచనే చేసేవాళ్లుకాదు. కానిప్పుడు ట్రెండ్ మారింది. విదేశీ చదువుల బాట పడుతున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు.
Study Abroad | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : విదేశీ చదువులంటే గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. పేద,మధ్య తరగతి వాళ్లు ఆ దిశలో ఆలోచనే చేసేవాళ్లుకాదు. కానిప్పుడు ట్రెండ్ మారింది. విదేశీ చదువుల బాట పడుతున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య 80 శాతానికిపైగా ఉంటున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారి సంఖ్య ఏటా పెరుగుతున్నదని చెప్తున్నారు. ఇక గతంలో విదేశీ చదువులంటే అబ్బాయిలే ఆసక్తి చూపేవారు.
తాజాగా అమ్మాయిలు అబ్బాయిలను మించి విదేశీ చదువులను అందిపుచ్చుకొంటున్నారు. మన దేశం నుంచి వెళ్తున్న వారిలో అత్యధికులు కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్‌లను ఎంచుకొంటున్నారు. ఆ తర్వాత స్థానం లో ఉబ్జెకిస్తాన్, పిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ తదితర దేశాలున్నాయి. 2022లో యూఎస్‌కు వెళ్లిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం స్ప్రింగ్ సీజన్ ప్రవేశాలు షురూ కావడంలో మళ్లీ విదేశీ చదువుల కోలాహలం ప్రారంభమైంది. ఇప్పటికే అధిక సంఖ్యలో మధ్య తరగతి విద్యార్థులే రిజిస్ట్రేషన్ చేసుకొన్నట్టుగా కన్సల్టెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
పలు దేశాలకు ఇలా..
- గతంలో యూఎస్, యూకే దేశాలకు విద్యార్థులు వెళ్లేవారు. తాజాగా జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల వైపు మళ్లుతున్నారు.
- కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు తాజాగా చైనా బాట పడుతున్నారు. 2022 ఆగస్టు నుంచి ఇప్పటివరకు చైనా 6,200 వీసాలను జారీ చేసింది.
- బ్రిటన్ భారతీయ విద్యార్థులకు 2022లో 1.4 లక్షల వీసాలను జారీ చేసింది. 2019లో వీటి సంఖ్య 34,261 మాత్రమే.
- ఫ్రాన్స్ 2019లో 10వేల వీసాలను భారతీయ విద్యార్థులకు జారీచేయగా, 2025 వరకు ఈ సంఖ్య 20వేలు దాటుతుందన్న అంచనాలున్నాయి.
- దేశవ్యాప్తంగా చూస్తే విదేశాలకెళ్లే ఏపీ, తెలంగాణ విద్యార్థుల వాటా 15 శాతం ఉండగా, హైదరాబాద్ విద్యార్థుల వాటా 7 శాతంగా ఉన్నది.
- ఆయా దేశాల్లో ఎంఎస్ ఇన్ పబ్లిక్‌హెల్త్, బి జినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్‌సైన్స్, ఎం బీఏ, డాటాసైన్స్, బిజినెస్ అనలిటిక్స్ తదితర కోర్సులకు అధిక డిమాండ్ నెలకొన్నది.
కారణాలివే..
- ఒకప్పుడు ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ తదితర భాషలు ప్రధాన అడ్డంకిగా మారేవి. ఇటీవలి కాలంలో అంతటా ఇంగ్లిష్ మీడియం చదువులు బోధిస్తున్నారు. అంతేగాక, చాలా స్కూళ్లల్లో స్పానిష్, ఫ్రెంచ్లలో చిన్నప్పటి నుంచే ప్రావీణ్యం సంపాదిస్తున్నారు. దీంతో సులభంగా గట్టెక్కగలమనే ధీమాతో విద్యార్థులు విదేశీ చదువుల బాట పడుతున్నారు.
- ఆర్థికంగా కూడా అనేక అనుకూలతలున్నాయి. రాష్ట్రంలో విస్తారంగా పంటలు పండటంతో ఓ మోస్తరు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొంటున్నారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఆరాటపడుతున్నారు.
- ఒకప్పుడు ఎకరాలు అమ్మాల్సి రాగా, ఇప్పుడు గుంటల్లో విక్రయిస్తే విదేశాలకు వెళ్లేంత డబ్బు వస్తుండటం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
- ప్రభుత్వం సమకూరుస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్లు పేద, అల్పాదాయ వర్గాలకు ఉపశమనాన్నిస్తున్నాయి. గత 8 ఏండ్లల్లో 5వేల మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్లను అందిపుచ్చుకొన్నారు.
- ప్లేస్‌మెంట్స్ లభిస్తుండటం, పోస్ట్ స్టడీ వర్క్‌వీసాలు వస్తుండటం కూడా ఇందుకు కారణమవుతున్నది.
తెలంగాణ నుంచే అధిక దరఖాస్తులు
విదేశీ విద్యకోసం వస్తున్న దరఖాస్తుల్లో తెలంగాణ నుంచే అధికంగా వస్తున్నా యి. మా సంస్థలో ఇప్పటివరకు 10వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. ఇందులో ఏపీ వాళ్లు 490 మంది విద్యార్థులు కాగా, తెలంగాణ నుంచి అత్యధికంగా 9,383 మంది విద్యార్థులు ఉన్నారు. జాతీయంగా 41 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకొన్నారు.
– అమిత్‌సింగ్, యూనిస్కాలర్స్ వ్యవస్థాపకుడు
మధ్య తరగతి వాళ్లే అధికం
విదేశీ చదువుల కోసం ప్రతి నెలా 12 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొంటున్నారు. వీరిలో అత్యధికులు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. అరిజోనా స్టేట్ వర్సిటీలో చేరేందుకు అత్యధికులు ఉత్సుకత చూపుతున్నారు. ఆ తర్వాత ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ రెండో స్థానంలో ఉన్నది. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకొనే ఆరాటంలో భాగంగానే విద్యార్థులు విదేశీ చదువులను ఇష్టపడుతున్నారు.
– వైభవ్గుప్తా, ఐస్కూల్ కనెక్ట్, సహ వ్యవస్థాపకుడు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

