TS Inter | తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ప్రతిపాదనే లేదని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు యథాతథంగా ఉంటాయని తేల్చిచెప్పింది. ఈ విద్యా సంవత్సరం మొత్తం ప్రత్యక్ష తరగతులు ఉంటాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన సెలవుల దృష్ట్యా, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజును స్వీకరించనున్నారు. రూ. 200 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 16 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఫిబ్రవరి 23 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుముతో మార్చి 2వ తేదీ వరకు పరీక్ష ఫీజును చెల్లించొచ్చు.