న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau-IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 16 నుంచి మే 7 వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. అయితే అభ్యర్థులు గేట్లో వ్యాలిడ్ స్కోరు కలిగి ఉండాలని పేర్కొన్నది.
మొత్తం ఖాళీలు: 150
ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 56, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 94 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: బీటెక్ లేదా బీఈలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో త్తీర్ణత సాధించాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో పీజీ చేయాలి. 2020, 21, 22లో వ్యాలిడ్ గేట్ స్కోర్ కార్డు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: గేట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా
అప్లికేషన్ విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.500
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 16
దరఖాస్తులకు చివరితేదీ: మే 7
వెబ్సైట్: www.mha.gov.in or www.ncs.gov.in