Polytechnic Colleges | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 పాలిటెక్నిక్ కాలేజీల్లో విద్యాబోధనకు గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 6న ఇంటర్వ్యూలుంటాయి. 7వ తేదీ నుంచి వారిని విధుల్లోకి తీసుకుంటారు.