సెప్టెంబర్ 26 తరువాయి
37. కింది వాక్యాలను పరిశీలించండి.
1. 14 (ఎఫ్)ను రద్దు చేయాలని కోరుతూ 2009, అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన నిర్వహించారు
2. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 14 (ఎఫ్) అధికారికంగా రద్దు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం 2011, ఆగస్టు 12న ప్రకటించింది పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : 14(ఎఫ్)ను రద్దు చేయాలని ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో నాటి ముఖ్యమంత్రి రోశయ్య 2009, అక్టోబర్ 19న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
1. హైదరాబాద్ ఫ్రీజోన్ తీర్పునకు వ్యతిరేకంగా ఇందిరాపార్క్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు
2. ప్రత్యేక రాష్ట్రంపై నిర్ణయం తీసుకోకపోతే నవంబర్ 29 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు కేసీఆర్ మరోసారి ప్రకటించారు పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : జైల్ భరో కార్యక్రమం – 2009, అక్టోబర్ 28
1. 1997, జనవరి 19న హైదరాబాద్‌లోని వివేకవర్దిని కాలేజీ దగ్గర ఉన్న అశోక్ టాకీస్‌లో తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సదస్సు జరిగింది
2. ఈ సదస్సులో గద్దర్ తొలిసారి ‘అమ్మా తెలంగాణమా – ఆకలి కేకల గానమా’ గీతాన్ని పాడాడు
3. 1999, మార్చి 8న భువనగిరిలో తెలంగాణ సదస్సు జరపాలని ఈ సదస్సులోనే నిర్ణయం తీసుకున్నారు పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1 సరైనది బి) 2 సరైనది
సి) 1, 2 సరైనవి డి) పైవేవీ సరైనవి కావు
జవాబు : సి
వివరణ : 1997, జనవరి 19న హైదరాబాద్ పుత్లీబౌలిలోని వివేకవర్ధిని కాలేజీ వద్ద ఉన్న అశోక టాకీస్‌లో తెలంగాణ సంస్కృతి వివక్షపై ఒక సభ జరిగింది. ఈ సభ నిర్వాహకుడు – పాశం యాదగిరి.
40. నా తల్లి తెలంగాణ.. తిరగబడ్డ వీణ అనే పాటను ఎవరు పాడారు?
ఎ) గద్దర్ బి) సుద్దాల
సి) దాసరి డి) శ్రీనివాస్ రావ్
జవాబు : ఎ
వివరణ : సభ సందర్భంగా నిర్వహించిన భారీ ప్రదర్శన వల్ల భువనగిరి వీధులు జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లాయి.
ఎ) సిద్దిపేట బి) సంగారెడ్డి
సి) కామారెడ్డి డి) భువనగిరి
జవాబు : ఎ
వివరణ : 1997 ఆగస్టులో రచయితలు, ఉద్యోగులు కలిసి తెలంగాణపై సిద్దిపేట పట్టణంలో సదస్సు నిర్వహించారు.
1. హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలి
2. 1956, నవంబర్ 1 నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వం తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు ఏయే రంగానికి ఎంతెంత నిధులు కేటాయించిందో శ్వేతపత్రంలో ప్రకటించాలి
3. ఆంధ్రాలో తలపెట్టిన పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను తక్షణమే రద్దు చేయాలి
4. రైతాంగం, గిరిజనులు పోడు చేసుకుంటున్న పట్టాల్లేని అన్ని రకాల భూములపై వెంటనే బేషరతుగా పట్టాలివ్వాలి పై వాక్యాల్లో సరైనది/సరికానిది ఏది?
ఎ) 1, 2 సరైనవి బి) 2, 4 సరైనవి
సి) 3 సరైనది డి) 1, 3, 4 సరైనవి
జవాబు : డి
వివరణ : సూర్యాపేట డిక్లరేషన్‌లోని అంశాలు
1. హైదరాబాద్ సహా 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలి
2. 1956, నవంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఏయే రంగానికి ఎంతెంత నిధులు కేటాయించిందో శ్వేతపత్రంలో
ప్రకటించాలి
3. ఆంధ్రాలో తలపెట్టిన పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను తక్షణం రద్దు చేయాలి. తెలంగాణ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న సాగుకు ఉద్దేశించిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు తక్షణం నిధులు కేటాయించాలి
4. రైతాంగం, గిరిజనులు పోడు చేసుకుంటున్న పట్టాల్లేని అన్ని రకాల భూములకు వెంటనే బేషరతుగా పట్టాలివ్వాలి. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్స్‌ను అనుసరించి ఏజెన్సీ ప్రాంతాలను గిరిజన స్వయం ప్రాంతాలుగా ప్రకటిస్తూ చట్టం చేయాలి. 1/70 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరిపి గిరిజనేతరుల స్వాధీనంలోని గిరిజన భూములన్నీ వెంటనే గిరిజనులకు ఇప్పించాలి
5. తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను, రాజ్యహింసను తక్షణమే నిలిపివేయాలి. అన్ని రకాల పోలీసు బలగాలను తెలంగాణ గ్రామాల నుంచి తక్షణం వెనక్కి పంపించాలి.
6. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ప్రజలపై నక్సలైట్లు అనే నెపంతో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
7. ప్రభుత్వ రంగంలోని మూసివేయాలనుకున్న పరిశ్రమలకు, నష్టాలతో నడుస్తున్న పరిశ్రమలకు అదనపు నిధులు కేటాయించి కార్మికులకు యాజమాన్యంలో, నిర్వహణలో భాగస్వామ్యం కల్పించాలి.
8. తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో 100 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయించాలి.
9. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును తెలంగాణ ప్రజల అవసరాలకే వినియోగించాలి
10. తెలంగాణలోని అన్ని రకాల పరిశ్రమల్లో, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల్లో స్థానికులనే నియమించాలి
11. తెలంగాణలో స్వయం ఉపాధి అవకాశాలను చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణలోని వివిధ సామాజిక వర్గాలకు దామాషా పద్ధతిపై లైసెన్స్, రుణాలను ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి నేరుగా మంజూరు చేయాలి
12. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజల భాషా, సాంస్కృతిక, ఆర్థిక వికాసానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి
13. భాషాభివృద్ధిలో భాగంగా తెలంగాణలోని విద్యాసంస్థల్లో అధికార యంత్రాంగం పరిపాలనా రంగంలో, న్యాయవ్యవస్థలో, మీడియాలో తెలంగాణ ప్రజల భాషను ప్రవేశపెట్టాలి. తెలంగాణ ప్రాంతంవారే సభ్యులుగా ఉండే తెలంగాణ భాషాభివృద్ధి బోర్డును నెలకొల్పాలి.
14. తెలంగాణ ప్రాంతంలోని గిరిజన భాషలను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయడానికి, లిపి లేని భాషలకు ప్రత్యేకమైన లిపిని తయారు
చేయడానికి గిరిజన కళలను, సంస్కృతిని చరిత్రను ప్రాంతాల వారీగా సమగ్రంగా అధ్యయనం చేసి అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక బోర్డును నియమించాలి
15. తెలంగాణలోని విద్యాసంస్థల్లో బోధిస్తున్న పాఠ్యాంశాల్లో వివిధ సామాజిక వృత్తులకు సంబంధించి నైపుణ్యం, శ్రమపై గౌరవభావం కలిగించే అంశాలను సాంఘికంగా అణిచివేయబడుతున్న పీడిత కులాల చారిత్రక నేపథ్యం, సంస్కృతి, జీవన విధానాన్ని శాస్త్రీయ దృష్టితో, ప్రజాస్వామిక దృక్పథంతో వివరించే అంశాలను చేర్చాలి.
16. తెలంగాణ ప్రాంత ప్రజల సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపి అన్ని రంగాల్లో వారిని అభివృద్ధి చేసే విధంగా సామాజిక న్యాయసూత్రాలకు అనుగుణంగా ఆర్థిక
విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.