మానవ హక్కుల ప్రకటన అనంతరం బాలల హక్కులు కూడా మానవహక్కులేననే స్పృహతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన (Declaration of Rights of the Child) ను చేసింది.
దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రకటనలో మొత్తం 10 అంశాలున్నాయి.
1. ఈ ప్రకటనలో హక్కులను బాలలందరూ అనుభవిస్తారు. బాలబాలికలు జాతి, లింగ, రంగు, భాష, మతం, రాజకీయం లేదా సామాజిక ఆవిర్భావం, ఆస్తి, పుట్టుక లేదా స్థితిలో తేడా లేకుండా అన్ని హక్కులకు అర్హులు.
2. బాలలు ప్రత్యేక సంరక్షణను అనుభవించాలి. స్వేచ్ఛాయుత, గౌరవప్రదమైన పరిస్థితుల్లో ఆరోగ్యకరంగా, స్వాభావికంగా, శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా అభివద్ధి చెందడానికి చట్టం లేదా ఇతర మార్గాల ద్వారా అవకాశాలు కల్పించాలి.
3. బాలబాలికలు పుట్టుకతో పేరు, జాతీయతకు అర్హులు.
4. బాలబాలికలు సామాజిక భద్రతా ప్రయోజనాలను అనుభవించాలి. ఆరోగ్యంగా పెరగడానికి, అభివృద్ధి చెందడానికి అర్హులు. ఇందు కోసం జనన పూర్వ, జననాంతర సంరక్షణతోపాటు తల్లీపిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ, రక్షణ కల్పించబడుతుంది. సరైన పోషకాహారం, గృహవసతి, వినోదం, వైద్యసేవలు పొందే హక్కు ఉంది.
5. శారీరకంగా, మానసికంగా లేదా సామాజికంగా బలహీనులైన పిల్లలకు ప్రత్యేక ఆదరణ, విద్య, సంరక్షణ అందించాలి.
6. సంపూర్ణ, సమ్మేళన మూర్తిమత్వ అభివృద్ధికి బాలలకు ప్రేమ, ఆదరణ కావాలి. వారు ఎక్కడ పెరిగినా సరైన సంరక్షణ -తిండి వాత్సల్యపూరిత, నైతిక, భౌతిక వాతావరణం కల్పించాలి. పిన్నవయస్సులో ఎంతో అవసరమైతే తప్ప తల్లి నుంచి వేరుచేయరాదు. సరైన కుటుంబ సంరక్షణ, సరిపడినంత ఆదాయమార్గాలు లేక బాలలకు సమాజం, ప్రభుత్వాధికారులు తగిన బాధ్యత వహించాలి. పేద కుటుంబాల్లో బాలల నిర్వహణ కోసం ప్రభుత్వమే ఆర్థిక లేదా ఇతర సహాయాన్ని అందించాలి.
7. కనీసం ప్రాథమిక స్థాయి వరకైనా ఉచిత, నిర్బంధ విద్య పొందడానికి బాలలు అర్హులు. సాధారణ సంస్కృతిని పెంచేలా, వారి సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి, నైతిక, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సమాజానికి ఉపయోగపడే పౌరుడు అవడానికి ఆస్కారమిచ్చే విద్యను అందించాలి.
8 బాలల అసక్తులు అనేవి వారు పొందే విద్యకే మార్గదర్శకాలుగా ఉండాలి. దీని కోసం తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఆటలు, వినోదం పొందడానికి పూర్తి అవకాశాలను పిల్లలు పొందాలి. ఈ హక్కును పొందడానికి సమాజం, ప్రభుత్వాధికారులు చొరవ చూపాలి.
8. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంరక్షణ, సహాయం పొందేవారిలో పిల్లలు ప్రథమంగా ఉండాలి.
9. అన్ని రకాల నిర్లక్ష్యం, క్రూరత్వం, దోపిడీల నుంచి బాలలకు రక్షణ కల్పించాలి. ఏ రకమైన అక్రమ రవాణాకు వారు గురికాకూడదు. సరైన కనిష్ఠ వయస్సు వచ్చేవరకు పిల్లలను ఎలాంటి ఉద్యోగంలో చేర్చుకోరాదు. వారి ఆరోగ్యాన్ని లేదా విద్యను, శారీరక, మానసిక, నైతిక వికాసాన్ని ఆటంకపరిచే ఎలాంటి వృత్తి లేదా ఉద్యోగంలోకి ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించకూడదు.
10. జాతి, మత, ఇతర వివక్షతలకు దారితీసే విధానాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించాలి. వారి శక్తిసామర్థ్యాలను తోటివారి సేవలకు వినియోగించేలా, స్నేహబంధం, సహనం, శాంతి, విశ్వఉదారత్వం పెంపొందేలా వీరిని పెంచాలి.
బాలలు అంటే
1. జీవించే హక్కు (మనుగడ హక్కు)
2. రక్షణ పొందే హక్కు (సంరక్షణహక్కు)
3. అభివృద్ధి చెందే హక్కు (వికాసహక్కు)
4. భాగస్వామ్యం హక్కు (పాల్గొనే హక్కు)
బాలల హక్కులను హరించే (కాలరాసే) పనులు:
బాలల హక్కులు – సంరక్షణ:
బాలల హక్కులు భారత రాజ్యాంగం:
బాలల హక్కులను అమలు చేయడానికి ప్రభుత్వం చేసిన చట్టాలు
1) బాలల చట్టం -1933
2) బాలల ఉద్యోగ కల్పనా చట్టం 1938
3) కర్మాగారాల చట్టం -1948
4) కనీస వేతన చట్టం (1948) బాలలను ఏ రకమైన పనిలోకి తీసుకున్నా వారు ఈచట్టం ప్రకారం శిక్షార్హులు
5) ప్లాంటేషన్ కార్మిక చట్టం (1951) 12 సంవత్సరాలు నిండని బాలలను ప్లాంటేషన్ పనుల్లోకి తీసుకోరాదు.
6) గనుల చట్టం (1952) : 16 సంవత్సరాల్లోపు బాల శ్రామికులను గనుల్లో నియమించడం నిషేధం.
7) మోటారు రవాణా కార్మిక చట్టం (1961) 15 సంవత్సరాల్లోపు బాలలను మోటారు రవాణా రంగంలో నియమించరాదు.
8) ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్ 1961: ప్రభుత్వ ఉద్యోగులైతే పిల్లలను ఏ రకమైన పనిలో పెట్టుకొన్నా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు
9) వెట్టి చాకిరి నిర్మూలన చట్టం (1976): బాలలను జీతగాళ్లుగా తీసుకుంటే నేరం
10) ఫ్యాక్టరీ చట్టం (1982) : 14 సంవత్సరాలు నిండని బాలబాలికలను ఫ్యాక్టరీ పనుల్లోకి తీసుకోరాదు.
11) బాల కార్మిక నిషేధ చట్టం (1986) : 14 సంవత్సరాల్లోపు వారిని పనుల్లోకి నియమించు కోవడం నిషేధం
12) బాల కార్మిక చట్టం 1986 ఏపీ షాప్స్/ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988 : 14 సంవత్సరాల్లోపు బాలలతో పనిచేయించే సంస్థల యజమానులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు
13) జువైనల్ జస్టిస్ యాక్ట్ (2000): నేరారోపణల నుంచి విముక్తి పొందే హక్కు
14) బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం -2005
15) బాలలకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం -2009
16) లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012
17) బాలల న్యాయం (బాలలపట్ల శ్రద్ధ, సంరక్షణ) సవరణ చట్టం -2013
– శ్రీతేజ పబ్లికేషన్స్ సౌజన్యంతో..