పోటీ పరీక్షల ప్రత్యేకం జనరల్ స్టడీస్
1. కింది వాటిలో చంద్రయాన్ ముఖ్య ఉద్దేశం కానిది/కానివి?
ఎ. చంద్రునిపై నీటి జాడను వెతకడం
బి. చంద్రుని త్రిమితీయ అట్లాస్‌ను తయారు చేయడం
సి. చంద్రునిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
డి. బెరీలియం-4ను వెతకడం
1) ఎ, బి 2) బి
3) సి, డి 4) డి
2. భూమి నీటి అంచుల్లో ఉండే పలుచని నీటి ప్రాంతం చంద్రునిపై పడటం వల్ల ఏర్పడే చంద్రగ్రహణం?
1) సంపూర్ణ చంద్రగ్రహణం
2) పాక్షిక చంద్రగ్రహణం
3) ప్రచ్ఛాయ/ఉపచ్ఛాయ చంద్రగ్రహణం
4) వలయాకార చంద్రగ్రహణం
3. వలయాకార సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందడాన్ని ఏ సూర్యగ్రహణం అంటారు?
1) మిశ్రమ సూర్యగ్రహణం
2) వలయాకార సూర్యగ్రహణం
3) పాక్షిక సూర్యగ్రహణం
4) సంపూర్ణ సూర్యగ్రహణం
4. కింది వాటిలో సరైనది/సరైనవి?
ఎ. ప్రతి అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది
బి. ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడదు
సి. 1980, ఫిబ్రవరి 16న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
5. జీవిత: లక్షలు, కోట్ల నక్షత్రాలు గల పెద్ద గుంపులను గెలాక్సీలు అంటారు
కవిత: సప్తర్షి మండలాన్ని ఆకాశంలో ఉత్తరం వైపు గల దీర్ఘ చతురస్రాకార గల భాగంలో గుర్తించవచ్చు అసత్య వాక్యాన్ని తెలిపినది ఎవరు?
1) జీవిత 2) కవిత
3) ఎ, బి 4) ఏదీకాదు
6. కింది వాటిలో సరైనది(వి)?
ఎ. శర్మిష్ట రాశిలోని ఆరు నక్షత్రాలు ‘U’ ఆకారాన్ని పోలి ఉంటాయి
బి. శర్మిష్ట రాశిలోని ‘M’ ఆకారంలోని నక్షత్రాల్లో మధ్యలో గల నక్షత్రం నుంచి తిన్నగా ఊహించిన రేఖ ధ్రువ నక్షత్రాన్ని చూపుతుంది
సి. 2008, నవంబర్ 22న మన దేశం చంద్రుని గురించి తెలుసుకోవడానికి చంద్రయాన్-1ను ప్రయోగించింది
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) బి
7. సత్య: ధ్రువ నక్షత్రం భూభ్రమణ అక్షానికి సూటిగా పై వైపున ఉన్నది. కాబట్టి భూభ్రమణం వల్ల అన్ని నక్షత్రాలు తిరుగుతున్నట్లు కనబడినా ధృవ నక్షత్రం మాత్రం నిలకడగా ఉన్నట్లు కనబడుతుంది
నిత్య: విశ్వంలోని అనేక కోట్ల గెలాక్సీల్లో ఒకటైన పాలపుంత అనే గెలాక్సీలో సూర్యుడు ఒకానొక నక్షత్రం సరైన వాక్యాన్ని తెలిపినది ఎవరు?
1) సత్య 2) నిత్య
3) ఎ, బి 4) ఏదీకాదు
8. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి గ్రహాల సరైన వరుస?
1) బుధుడు, భూమి, కుజుడు, శుక్రుడు
2) బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు
3) బుధుడు, భూమి, శుక్రుడు, కుజుడు
4) భూమి, బుధుడు, శుక్రుడు, కుజుడు
9. ఎ. మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం-సూర్యుడు బి. ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది. ఈ మార్గాన్ని కక్ష్య అంటారు సి. సూర్యుని నుంచి గ్రహాలకున్న దూరం పెరుగుతున్న కొద్దీ వాటి పరిభ్రమణ కాలం తగ్గుతుందిఅసత్య వాక్యం?
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి
10. ఏ అంతరిక్ష వస్తువైనా మరో దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు?
1) గ్రహం 2) ఉపగ్రహం
3) ఆస్టరాయిడ్ 4) ఉల్క
11. బుధుడు ఏ గ్రహానికి సంబంధించి సరైన వాక్యం(లు)?
ఎ. సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం
బి. శుక్ర గ్రహం కంటే పెద్ద గ్రహం
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
12. బుధుడు ఏ గ్రహానికి సంబంధించి సరికానిది(వి)?
ఎ. ఈ గ్రహాన్ని సూర్యోదయానికి కొద్ది సమయం ముందు గానీ సూర్యాస్తమయం వెంటనే గానీ, దిజ్మండలంకు దగ్గరలో దీన్ని చూడవచ్చు
బి. బుధ గ్రహానికి ఒక ఉపగ్రహం ఉంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఏదీకాదు
13. శుక్ర గ్రహానికి సంబంధించి సరైన భావన(లు)?
ఎ. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం
బి. అన్ని గ్రహాల్లో కెల్లా
ప్రకాశవంతమైన గ్రహం
సి. దీన్ని వేగుచుక్క, సాయంకాలం చుక్క అనే రెండు పేర్లతో పిలుస్తారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
14. శుక్ర గ్రహానికి ఉపగ్రహాల సంఖ్య?
1) 1 2) 2 3) 0 4) 4
15. కింది వాటిలో తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు?
1) శుక్రుడు, యురేనస్
2) శుక్రుడు, నెఫ్ట్యూన్
3) యురేనస్, శని
4) కుజుడు, యురేనస్
16. వీణ: సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవాన్ని కలిగి ఉన్న గ్రహం-గురుడు
వాణి: ఓజోన్ పొరను కలిగి ఉన్న గ్రహం-భూమిసరైన వాక్యాన్ని తెలిపినది ఎవరు?
1) వీణ 2) వాణి
3) ఎ, బి 4) ఏదీకాదు
17. జతపరచండి.
గ్రహం పేరు పరిభ్రమణ కాలం
ఎ. బుధుడు 1. 687 రోజులు
బి. యురేనస్ 2. 84 సంవత్సరాలు
సి. బృహస్పతి 3. 12 సంవత్సరాలు
డి. కుజుడు 4. 88 రోజులు
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-2, సి-3, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
18. సౌర కుటుంబంలో భూ కక్ష్యకు బదులు ఉన్న గ్రహాల్లో మొదటిది?
1) అంగారకుడు 2) శుక్రుడు
3) గురుడు 4) యురేనస్
19. జతపరచండి.
గ్రహాలు ఉపగ్రహాల సంఖ్య
ఎ. కుజుడు 1.13
బి. గురుడు 2.50
సి. యురేనస్ 3.27
డి. నెఫ్ట్యూన్ 4.2
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-4, బి-2, సి-3, డి-1
20. కింది వాటిలో అరుణ గ్రహం అని దేనికి పేరు?
1) యురేనస్ 2) కుజుడు
3) గురుడు 4) శని
21. ధ్వనుల పిచ్ ఆరోహణ క్రమం?
1) పురుషుడు, మహిళ, శిశువు, కీటకం
2) శిశువు, కీటకం, మహిళ, పురుషుడు
3) కీటకం, శిశువు, మహిళ, పురుషుడు
4) మహిళ, పురుషుడు, కీటకం, శిశువు
22. జతపరచండి.
ఎ. లాన యంత్ర శబ్దం 1. 90 db
బి. జెట్ ఇంజిన్ 2. 120 db
సి. సాధారణ సంభాషణ 3. 60 db
డి. కారు హారన్ 4. 110 db
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-3, బి-2, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
23. మానవుని శ్రవ్య అవధి?
1) 20 Hz కంటే తక్కువ
2) 20 Hz – 20 KHz మధ్య
3) 20,000 Hz కంటే ఎక్కువ
4) 20 Hz-200 KHz మధ్య
24. సముద్ర గర్భంలోని గనులను, తల్లి గర్భంలోని శిశువులను గుర్తించడానికి ఉపయోగపడేవి?
1) పరశ్రావ్యాలు 2) అతి ధ్వనులు
3) శ్రవ్య ధ్వనులు 4) ఏదీకాదు
25. జతపరచండి.
జంతువులు ధ్వనులు
ఎ. కుక్క 1,00,000 Hz
బి. గబ్బిలం 1,00,000 Hz కంటే ఎక్కువ
సి. డాల్ఫిన్స్ 50,000 Hz
1) ఎ-3, బి-1, సి-2
2) ఎ-1, బి-2, సి-3
3) ఎ-2, బి-1, సి-3
4) ఎ-2, బి-3, సి-1