BFA | తెలుగు యూనివర్సిటీ, మే 21 : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే బీఎఫ్ఏ శిల్పకళ, చిత్రలేఖనం కోర్సుల్లో చేరడానికి ఆసక్తి గల విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె. హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలుగు విశ్వవిద్యాలయంలోని శిల్పం చిత్రలేఖనం శాఖ ద్వారా నిర్వహించే ఈ శిక్షణా తరగతులను ఈ నెల 26 నుంచి జూన్ 14 వరకు మూడు వారాల పాటు నిర్వహిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వర్సిటీలోని శిల్పం, చిత్రలేఖనం మరియు ప్రింట్ మేకింగ్ అధ్యాపకుల ద్వారా కోర్సుకు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఈ తరగతుల ద్వారా నేర్చుకునే అవకాశం ఉందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 83090 11865, 83094 98807 చరవాణి ద్వారా సంప్రదించాలని సూచించారు.