హైదరాబాద్: రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల (Entrance exams) కోసం వచ్చే నెల 15 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను మైనార్టీ గురుకులాల్లో ఐదు, ఆరు, ఎనిమిది తరగతులు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. దీనికోసం మే 15న 5వ తరగతి, 22న 6 నుంచి 8వ తరగతులకు ప్రవేశపరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు జూన్ 4న పరీక్ష ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు tmreis.telangana.gov.in, 040–23437909 సంప్రదించవచ్చని పేర్కొన్నారు.