హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ ఎగ్జామ్ను మే 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
2026-28 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు కోసం రెండు రోజుల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలను నిర్వహిస్తామన్నారు.