ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 22 : ఉస్మానియా యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ అకాడమీలో ఈ నెల 25వ తేదీ నుంచి తరగతులను నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. గణేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు నిర్వహించబోయే ఈ తరగతులను ఆర్ట్స్ కళాశాలలోని రూం నెంబర్ 57లో రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు మాత్రమే తరగతులను అనుమతిస్తామని పేర్కొన్నారు. తరగతి గదిలోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కళాశాల ఐడీ కార్డును చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.