CISF Recruitment | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటాలో హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ చేస్తున్నది. 403 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 6 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ టెస్ట్, ఆటల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 403
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 18 నుంచి 23 ఏండ్ల లోపు వయస్సు లేదా 2002 ఆగస్టు 2 నుంచి 2007 ఆగస్టు 1 మధ్య జన్మించినవారై ఉండాలి. అదేవిధంగా టీమ్, వ్యక్తిగత విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత్కు ప్రాతినిథ్యం వహించి లేదా జాతీయ స్థాయి టోర్నమెంట్లలో రాష్ట్రం తరఫున ఆడి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
ఎంపిక విధానం: ఫిజికల్ టెస్ట్, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ ఆధారంగా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 6
వెబ్సైట్: cisfrectt.cisf.gov.in.