ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 11 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడవచ్చని ఆయన సూచించారు.