e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News బీటెక్ విద్యార్థుల‌కు రాజ్యాంగ బోధ‌న‌..!

బీటెక్ విద్యార్థుల‌కు రాజ్యాంగ బోధ‌న‌..!

హైద‌రాబాద్‌: ఇక‌పై బీటెక్ విద్యార్థుల‌కు భార‌త రాజ్యంగాన్ని ఒక స‌జ్జెక్టుగా బోధించనున్నారు. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూన‌వర్సిటీ హైద‌రాబాద్ (JNTUH)కు అనుబంధంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో విద్యార్థుల‌కు ప్ర‌త్యామ్నాయ బోధ‌నాంశంగా భార‌త రాజ్యంగం గురించి చెప్ప‌నున్నారు. యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ డాక్ట‌ర్ మంజూర్ హుస్సేన్ ఈ మేర‌కు అన్ని అనుబంధ‌ ఇంజినీరింగ్ కాలేజీల‌కు లేఖ‌లు రాశారు.

JNTUH అనుబంధ కాలేజీల్లో BTech, CE, ECE, ME, EEE, CSE, IT కోర్సులు చ‌దువుతున్న విద్యార్థులకు భారత రాజ్యంగాన్ని బోధించాల‌ని రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్ త‌న లేఖ‌ల్లో పేర్కొన్నారు. యూనివ‌ర్సిటీ నిర్ణ‌యం ప్ర‌కారం.. బీటెక్ సెకండ్‌, థ‌ర్డ్ సెమిస్ట‌ర్ విద్యార్థులు, బీటెక్ ఫ‌స్ట్‌, థ‌ర్డ్ సెమిస్ట‌ర్ రీ అడ్మిటెడ్ విద్యార్థులు భార‌త రాజ్యాంగాన్ని ప్ర‌త్యామ్నాయ స‌బ్జెక్టుగా ఎంచుకోవ‌చ్చు. అదేవిధంగా ఇప్ప‌టికే ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ చ‌దివిన వారు, ఎన్విరాన్‌మెంట‌ల్‌ సైన్స్ లేదా ఇంటిగ్రేటెడ్ ప్రాప‌ర్టీ రైట్స్ ఇన్ 2020-21 విద్యార్థులు త‌దుప‌రి విద్యాసంవ‌త్స‌రం నుంచి భార‌త రాజ్యాంగాన్ని ఆప్ష‌న్‌గా ఎంచుకునే అవ‌కాశం ఉన్న‌ది.

- Advertisement -

అయితే, రెగ్యుల‌ర్ బీటెక్ ఎనిమిది సంవ‌త్స‌రాలు చ‌దివిన విద్యార్థులు, లేట‌ర‌ల్ ఎంట్రీ బీటెక్ ఆరు సంవ‌త్స‌రాలు చ‌దివిన విద్యార్థులు రీ అడ్మిష‌న్‌కు అర్హులు కార‌ని యూనివ‌ర్సిటీ స్ప‌ష్టంచేసింది. ఇత‌ర విద్యాసంస్థ‌ల నుంచి బదిలీపై వ‌చ్చిన విద్యార్థులకు, JNTUH అనుబంధ అటాన‌మ‌స్ కాలేజీల నుంచి JNTUH అనుబంధ కాలేజీల‌కు బ‌దిలీపై వ‌చ్చిన విద్యార్థ‌లకు ఈ ప్ర‌త్యామ్నాయ స‌బ్జెక్టుల‌ను ఎంచుకునే అవ‌కాశం లేద‌ని తెలిపింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement