టెట్‌కు 1.36 లక్షల దరఖాస్తులు
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన్నారు.
- ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లు 28వేల మంది
హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) పరీక్షకు ఇన్ సర్వీస్ టీచర్లు పోటీ పడుతూనే ఉన్నారు. ఈసారి 28,144 మంది టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,714 మంది పురుషులు, 14,430 మంది మహిళా టీచర్లు ఉన్నారు. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా, ఈసారి మొత్తం 1,36,418 మంది దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో 2.37 లక్షల దరఖాస్తులు రాగా, ఈ సారి 1.36 లక్షలే వచ్చాయి. దరఖాస్తుల్లో దొర్లిన తప్పుల సవరణకు ఇచ్చిన గడువు ఈ నెల 3న ముగియనున్నట్టు టెట్ కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ వేయకుండా కేవలం టెట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థుల్లో టెట్‌పై ఆసక్తి తగ్గుతున్నది.
రేపు నీట్ ఎగ్జామ్
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(యూజీ) ఎగ్జామ్ ఆదివారం జరుగనున్నది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు రాష్ట్రం నుంచి 70 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 140కి పైగా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈసారి సెంటర్లను విద్యార్థుల నివాసాలకు 5-10 కిలోమీటర్ల దూరంలోనే కేటాయించారు. దీంతో విద్యార్థులకు రవాణా ఇబ్బందులు తప్పనున్నాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

