హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో (BRAOU) ప్రవేశాల గడువును అధికారులు పొడిగించారు (Extension). బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులతోపాటు పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. వివరాలకు www.braouonline.in లేదా 7382929570, 7382929580 సెల్నంబర్లను సంప్రదించాలని సూచించారు.