AP Poycet Results | ఏపీలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను వెల్లడించారు. పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,77,581 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,63,008 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,48,950 మంది అర్హత సాధించారు. అంటే 91.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈసారి పాలిటెక్నిక్ ఫలితాల్లోనూ బాలికలే సత్తా చాటారు. 93.57 శాతం ఉత్తీర్ణతో ముందజలో ఉన్నారు. ఇక గిరిజన విద్యార్థులు సైతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మొత్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 99.11 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా.. 95.46 శాతం ఉత్తీర్ణతతో పోలవరం జిల్లా రెండో స్థానం, 93.45 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ polycetap.gov.in చూడాలని సూచించారు. అలాగే వాట్సాప్‌లో మన మిత్ర నంబర్ 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపించడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చని తెలిపారు.