త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. | భారత్‌లో త్వరలో మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానున్నది. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా తయారు చేసిన కొవిడ్ టీకా జైకోవ్-డీ కోసం అత్యవసర వినియోగానికి అనుమతి

బెంగళూరు : భారత్‌లో త్వరలో మరో కొవిడ్ టీకా అందుబాటులోకి రానున్నది. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా తయారు చేసిన కొవిడ్ టీకా జైకోవ్-డీ కోసం అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి గురువారం దరఖాస్తు చేసింది. అనుమతి లభిస్తే ఏటా 120 మిలియన్ మోతాదుల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్, భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్, రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. వ్యాక్సినేషన్లో వినియోగిస్తున్నారు. మోడెర్నా టీకా దిగుమతి కోసం సైతం ఇటీవల డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ప్రస్తుతం జైడస్ క్యాడిలా వ్యాక్సిన్‌కు అనుమతి లభిస్తే వస్తే ఐదో టీకాగా నిలువనుంది.
కంపెనీ 12-18 సంవత్సరాల వయసు పిల్లలతో సహా దేశవ్యాప్తంగా 50కిపైగా కేంద్రాల్లో 28వేల మంది వలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించింది. చివరి దశ ట్రయల్స్‌లో జైకోవ్-డీ సామర్థ్యాన్ని చూపిందని కంపెనీ పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్లు, డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా టీకా పని సమర్థవంతంగా పని చేస్తుందని పేర్కొంది. జైడస్ క్యాడిలా టీకా ప్లాస్మిడ్ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్. దేశంలో 12-18 సంవత్సరాల వయస్సులో కౌమార బాలలపై కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. ప్లాస్మిడ్ డీఎన్ఏ ప్లాట్‌ఫామ్ ప్లగ్ అండ్ ప్లే టెక్నాలజీ కరోనా వైరస్‌లోని ఉత్పరివర్తనాలను ఇది సులభంగా ఎదుర్కోవటానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

