హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్‌లను ఏపీ మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జర్నలిస్టుల అరెస్ట్‌లు పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు.
పండుగ రోజు తలుపులు పగులగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. అరెస్టులు నిరంకుశ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలని, అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వాన్ని జగన్ డిమాండ్ చేశారు.