హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగా ణ) : జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని, దీంతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సిట్ అధికారులు సంయమనం పా టించాలని సూచించారు. ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టుపై జగ్గారెడ్డి స్పందించారు.
ఇటీవల కొన్ని చానల్స్‌లో ఆధారాలు లేకుండా మంత్రుల మీద, ఉన్నతాధికారుల మీద వ్యక్తిగతంగా కించపరిచేలా కథనాలు వచ్చాయని, ఆ విషయంలో తానూ తీవ్రంగా స్పందించానని గుర్తుచేశారు. ఎవరిని సిట్ విచారణ చేయాలని అనుకుంటున్నదో వాళ్ల కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ పండుగ పూట సీనియర్ జర్నలిస్టులను విచారణ పేరుతో అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం సరికాదని, ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా ఉపయోగపడే పరిస్థితి ఉందని వాపోయారు.