అమరావతి : ఏపీలో డ్వాక్రా మహిళలకు ( DWCRA Women ) ఇచ్చిన హామీలు కూటమి సర్కార్ అమలు చేయక పోవడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan ) పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు అందింతే వారికి ఆర్థిక స్వావలంభన చేకూరడంతో పాటు ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులకు అవకాశముంటుందని గురువారం ట్విట్టర్( Twitter ) లో వెల్లడించారు.
ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోలో స్వయం సహాయక గ్రూపు రుణాలపై వడ్డీ రాయితీ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చి చేతులెత్తే సిందని ఆరోపించారు. టీడీపీ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం రూ. 3వేల కోట్లు అవుతే రెండు సంవత్సరాలకు రూ.6 వేల కోట్లు ప్రయోజనం మహిళలకు అందకుండా పోయిందని విమర్శించారు.
వైసీపీ హయాంలో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని, ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. పెంచిన రుణ పరిమితిపై వడ్డీ రాయితీ మాట అటుంచితే, కనీసం ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ పథకానికి కూడా ఎటువంటి మద్దతు లేకుండా చేసి నిష్ప్రయోజనం చేశారని మండిపడ్డారు.