హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తేతెలంగాణ) : ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌ను వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. రంగరాజన్‌కు ఫోన్ చేసిన వైఎస్ జగన్..దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన విలువలను పాటిస్తున్న రంగరాజన్‌పై దాడి బాధాకరమైన విషయమని వైఎస్ జగన్ పేర్కొన్నారు.