దిస్పూర్ : వీడియో షూట్ కోసం వెళ్లి వస్తూ ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాపడ్డారు. ఈ ఘటన అసోంలోని దర్రాంగ్ జిల్లాలో చోటు చేసుకున్నది. దరాంగ్ జిల్లాలోని దల్గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేసీమరి ప్రాంతంలోని జాతీయ రహదారి-15పై ఎదురుగావచ్చిన కారు, ట్రక్కు ఢీకొట్టుకున్నాయి. ఘటనలో 13 ఏళ్ల మైనర్ బాలికతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయని పోలీసులు పేర్కొన్నాయి. తేజ్‌పూర్ నుంచి మంగళ్దోయ్ వైపు కారు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందని పేర్కొన్నారు.
మృతులను ఫరీదుల్ ఇస్లాం, ఆజాద్ అలీ, ఇబ్రహీం అలీ, మంజువారా బేగం, సానియా అక్తర్‌గా గుర్తించారు. వీరు దర్రాంగ్ వాసులు కాగా.. యూట్యూబర్లుగా పోలీసులు చెప్పారు. సానియా అక్తర్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్ వీడియో షూట్ కోసం బృందం రౌతా ప్రాంతానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా బేసీమరి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను మంగళ్‌దై సివిల్ ఆసుప్రతిలో ప్రథమ చికిత్సలు అందించి.. ఆ తర్వాత గౌహతి మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు.