Youtuber Nandana : తెలుగులో ప్రముఖ యూట్యూబర్ అన్నె రమా నందన(Anne Rama Nandana)ను పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ వీసాతో పాటు ఉద్యోగాల ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నందన దంపతులపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు ఎయిర్పోర్టులో దిగగానే పాస్పోర్టు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. లండన్ ఉంటూ నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులరైన నందన పలువురికి ఉద్యోగాల ఆశ చూపి లక్షలు కాజేశారని ఆరోపణలున్నాయి.