Crime news : నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లిపట్ల ఓ కొడుకు క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటలకు తాళలేక పరుగులు పెడుతుంటే అక్కడి నుంచి పారిపోయాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముత్తినేని వినోద (50), సతీశ్ ఇద్దరూ తల్లీ కొడుకులు. శనివారం ఉదయం సతీశ్ తన తల్లి వినోదపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మంటల్లో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
వినోదకు 85 శాతం కాలిన గాయాలయ్యాయని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన కొడుకే తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వినోద పేర్కొన్నారు. కాగా ఆస్తి తగాదాలే ఘటనకు కారణమని తెలుస్తోంది.