జమ్మికుంట: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం వావిలాల గోపాలపురం గ్రామం నుంచి సుమారు 50 మంది యువకులు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి జమ్మికుంట మండల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు. టీఆర్ఎస్లో చేరినవారిలో సతీశ్‌రెడ్డి, గుర్రం అజయ్, తుమ్మ సాయితేజ, పరకాల రాజు, అఖిల్, రవితేజ, రాహుల్, అఫ్రోజ్, వినయ్, సాయి, సంజయ్, ఏ వంశీ, దేవరాజ్, భానురెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.