Road accident | అడవి పందులను తప్పించబోయి రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Road accident | కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి తుమ్మ చెట్టుకు ఢీకొన్నాడు.
కుభీర్ : కుభీర్ మండలం పార్డి (కె) రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident ) ఓ యువకుడు మృతి చెందాడు. హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మహోర్ శీను ( 30) అడవి పందులు ( Wild Boars) అడ్డం రావడంతో వాటిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి తుమ్మ చెట్టుకు ఢీకొన్నాడు. దీంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) తెలిపారు.
బుధవారం సాయంత్రం పార్డిలోని తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి కుభీర్కు వెళ్లి పనులను ముగించుకొని రాత్రి 9 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి తిరిగి వస్తుందడగా ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం కుబీర్ సంతకు వెళ్తున్న పలువురు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ సీఐ నైలు నాయక్, ఎస్సై కృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. పంచనామా నిర్వహించి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించాలి : ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్
Dalits Complaint | కాంగ్రెస్ ఎమ్మెల్యే వేధింపులపై కలెక్టర్కు దళితుల ఫిర్యాదు
‘విశ్వబ్రాహ్మణ విద్యార్థి వసతి గృహ కమిటీ ఏర్పాటు అప్రజాస్వామికం’
Gas Refilling | అక్రమంగా వంట గ్యాస్ రీఫిల్లింగ్.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
అర్హులైన ప్రతి కుటుంబానికి జీవిత బీమా
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

