ఇంద్రవెల్లి : మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య ( Suicide ) చేసుకున్న ఘటన మండలంలోని ధనోరా(బీ)గ్రామపంచాయతీ పరిధిలోని ఇన్కర్గూడ గ్రామంలో జరిగింది. ఎస్సై సాయన్న ( SI Sayanna) తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్కర్గూడ గ్రామానికి చెందిన ఎల్నారే అనిల్, ఉమా దంపతులకు ఎల్నారే శుభం(23) ఏకైక కుమారుడు. డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్నాడు.
కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడగా ఈ నెల 7న తల్లి ఉమా కొడుకును మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన శుభం వ్యవసాయ చేనుకు వెళ్లి గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని వివరించాడు. దీంతో అతడిని గ్రామస్థుల సహకారంతో ఆదిలాబాద్ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహనం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.