West Bengal | హౌరా: ఫేస్బుక్ ప్రియుడి మోజులో పడిన ఓ యువతి తన భర్తను దారుణంగా మోసగించింది. పశ్చిమ బెంగాల్లోని సంక్రెయిల్కు చెందిన దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె విద్య, వివాహం కోసం డబ్బు కూడబెట్టాలని ఆ యువతి తన భర్తను కోరింది. మూత్రపిండాలను అమ్మితే డబ్బులు వస్తాయని, వాటిని బ్యాంకులో వేద్దామని మాయ మాటలు చెప్పింది. దీంతో ఆయన తన మూత్రపిండాన్ని రూ.10 లక్షలకు విక్రయించారు. ఈ సొమ్మును తీసుకుని ఆ యువతి తన ఫేస్బుక్ ప్రియుడితో కలిసి పారిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరూ బారక్పూర్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లగా, “ఏం చేసుకుంటావో చేసుకో, పో’ అని ఆ యువతి తన భర్తను బెదిరించింది.