ప్రేమ వేధింపులకు యువతి బలి ?
సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామం బోడ తండాకు చెందిన బోడ ప్రణీత (17) అనే యువతి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందింది. మాన్య తండాకు చెందిన నరేశ్ అనే యువకుడి వేధింపులు..
– సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం బోడతండాలో ఘటన
ఆత్మకూర్.ఎస్, అక్టోబర్ 23 : సూర్యాపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామం బోడ తండాకు చెందిన బోడ ప్రణీత (17) అనే యువతి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందింది. మాన్య తండాకు చెందిన నరేశ్ అనే యువకుడి వేధింపులు భరించలేకనే తమ కుమార్తె చనిపోయిందని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెను నరేశ్ అనే వ్యక్తి వేధింపులకు గురిచేసి ట్రాన్స్ఫార్మర్ పైకి నెట్టి చంపాడని తల్లిదండ్రులు ఆరోపించడం కలకలం రేపుతోంది. యువతి హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. దసరా సెలవుల్లో ఇంటికి వచ్చి ఇలా అనుమానాస్పదరీతిలో మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది? యువతి మృతికి వేధింపులే కారణమా? లేక మరేదైనా కారణమా? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

