Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
Sukhbir Badal : పంజాబ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని శిరోమణి అకాళిదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు.
Sukhbir Badal : పంజాబ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని శిరోమణి అకాళిదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు, మాజీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్ వెల్లడించారు. తాము ఎన్డీయేలో చేరొచ్చని తెలిపారు. శుక్రవారం పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియాతో సుఖ్బీర్ సింగ్ భేటీ అయ్యారు. అనంతరం సుఖ్బీర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా.. తమ పార్టీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్న వారితో కలిసి పని చేసేందుకు సిద్ధమన్నారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులే అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మిగిలి ఉన్నది బీజేపీయే కాబట్టి.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు పరోక్షంగా ప్రస్తావించారు. గతంలో అకాళిదళ్ పార్టీ ఎన్డీయే కూటమిలోనే ఉండేది. దీంతో ఈసారి కూడా ఆయన అదే కూటమిలో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని, అధికారం దక్కించుకోవాలని బాదల్ భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఎన్డీయేకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఆ కూటమికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
గత ఆగష్టులో ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అప్పుడే ఆయన ఎన్డీయే వైపు చేరడం ఖాయమైందనే ప్రచారం జరిగింది. తాజాగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు అని ప్రకటించడం.. తమ సిద్దాంతాలకు దగ్గరగా ఉండేవారితో పొత్తు పెట్టుకుంటాం అని చెప్పడం ద్వారా బీజేపీతో పొత్తుపై ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. 2020లో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి నుంచి అకాళిదళ్ బయటకు వచ్చింది. ఆ తర్వాత చివరగా 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఓడిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- BJP
- Punjab
- Sukhbir Badal
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

