KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అడ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ : గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అడ్డమైన మాటలు, అడ్డమైన ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన అంబర్‌పేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు గోస పడుతున్నారు. తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని మండిపడ్డారు. పరిపాలన చేతకాక ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎల్‌నినో ప్రభావంపై 10 నెలల ముందే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.పక్క రాష్ట్రాలు, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాజెక్టులను నింపుకున్నాయి.
తెలివిలేని రేవంత్ రెడ్డి..
తెలివిలేని రేవంత్ రెడ్డి మాత్రం ప్రాజెక్టులను నింపలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం పంపులు ప్రారంభిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తాను చేసిన అబద్ధాలు ప్రజల ముందు తేలిపోతాయని రేవంత్ రెడ్డి కుట్ర చేశారు. మేడిగడ్డ కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డను కూల్చారన్నారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేడిగడ్డ కూలిపోయిందంటూ అబద్ధాలు చెప్పించారన్నారు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి దున్నపోతు ఇనిందంటే.. కిషన్ రెడ్డి దూడను కట్టేయమంటారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటవుతాయి. పిచ్చోడి చేతిలో రాయిలా పాలన సాగుతోంది. మరో ఏడాది రేవంత్ రెడ్డి హడావుడి ఉంటుందని, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. తెలంగాణలో లూటీ పాలన నడుస్తోంది. తెలంగాణలో తిరిగి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాంగ్రెస్ చేతుల్లో మోసపోయిన అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నాయని చెప్పారు.
మోదీ ఏం చేస్తున్నాడో చూస్తానే ఉన్నాం..
తెలంగాణలోనే కాదు మళ్లీ దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీలు దేశంలో కీలకం కాబోతున్నాయి. నాలుగు సంవత్సరాల కింద కేసీఆర్ కాంగ్రెస్, బిజెపియేతర కూటమి అంటే చాలామందికి అర్థం కాలేదు. మోదీ ఏం చేస్తున్నాడో చూస్తానే ఉన్నాం. ఈరోజు ఒకవైపు దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్న బిజెపికి ప్రత్యామ్నాయ ఎజెండా లేని కాంగ్రెస్ చూసిన తర్వాత కెసిఆర్ చెప్పింది వాస్తవం అని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రాహుల్ గాంధీ ఎంత చేసిన లాభం లేదు. రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు.
దేశంలో కాంగ్రెస్ విఫలమైంది కాబట్టే బిజెపి పార్టీపై సీజేపీ పేరుతో యువతీ యువకులు పోరాటం చేస్తు న్నారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులను బిజెపి బెదిరించగలుగుతుంది కానీ యువతరాన్ని కాదు అని అర్థమైంది. బిజెపి గత పది సంవత్సరాలు ఎప్పుడు లేనంత బలహీనంగా తయారయిందన్నారు. కాంగ్రెస్, బిజెపి ఎంపీలు తెలంగాణలో కలిసిపోయి పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయకుండా కేవలం.. కేసీఆర్, కేటీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకు న్నారు.
కాంగ్రెస్‌కు వారు బుద్ధి చెప్పడం ఖాయం..
రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పిటిసి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌కు లేదని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఎన్నికలు పెడితే 2017లో సెంచరీ కొట్టిన తీరుగా బీఆర్ఎస్ కార్పొరేషన్లను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి మొదలుకొని ఎన్నికల దాకా కలిసి పనిచేయాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధన బలాన్ని మాత్రమే నమ్ము కున్నది. విద్యార్థులను నిరుద్యోగులను యువతి యువకులను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వారు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

