హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ అభిలాష్ రజత పతకంతో మెరిశాడు. పురుషుల 400మీటర్ల ఫ్రీైస్టెల్ రేసును జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ)కి చెందిన అభిలాష్ 4: 17:67 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో పోటీపడిన శుభమ్(సావిత్రిభాయ్ పూలే), మాథ్యూస్(ఎమ్ఎస్ రామయ్య) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. స్విమ్మింగ్‌లో రజతం ఖాతాలో వేసుకున్న అభిలాష్‌ను వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ చెన్నకేశవరావు అభినందించారు.