పెన్పహాడ్, ఏప్రిల్ 18 : అనుమానాస్పద స్థితిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గరిడ్డేపల్లి మండలం పోనుగొడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (36) తండ్రి షేక్ జానీ, తల్లి షేక్ సాజిదా బేగం వృత్తి రీత్యా హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. సొంత పనులపై ఇంటికి వచ్చి శుక్రవారం ఉదయం 5 గంటలకు బస్సు ఎక్కి తిరిగి హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పి తెల్లవారేసరికి అనంతారం గ్రామం పరిధిలోని అడ్డరోడ్డు వద్ద మిషన్ భగీరథ ట్యాంక్ సమీపంలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ కస్తాల గోపికృష్ణ పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.