పంజీమ్(గోవా): ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి గెలుపు జోరు కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన మూడో రౌండ్ తొలి గేమ్‌లో అర్జున్..శంషుద్దీన్ వోకిదోవ్(ఉజ్బెకిస్థాన్)పై అద్భుత విజయం సాధించాడు.
తెల్లపావులతో బరిలోకి దిగిన అర్జున్..ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ 30 ఎత్తుల్లో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు డానియల్‌పై హరికృష్ణ గెలిచాడు.