MCA : మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంతో భారత జట్టు కొత్త అధ్యాయానికి నాంది పలికింది. నలభై ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ ఛాంపియన్‌గా అవతరించిన టీమిండియా దేశంలో మహిళా క్రికెట్ పురోగతికి దారులు వేస్తోంది. అతివలను అన్ని రంగాల్లో ప్రోత్సహించినట్టే క్రికెట్లోనూ వెన్నుదన్నుగా నిలిచేందుకు ముంబై క్రికెట్ సంఘం (MCA) ఓ అడుగు ముందుకేసింది. వరల్డ్ కప్ ఛాంపియన్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్‌లను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సన్మానించిన తర్వాత ఎంసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై కేంద్రంగా మహిళా క్రికెటర్ల కోసం వసతి, భోజన సౌకర్యాలతో ప్రత్యేకంగా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది.
భారత్‌లో మహిళా క్రికెటర్లకు మెరుగైన శిక్షణ ఇప్పిస్తే అద్భుతాలు చేస్తారు అనడానికి వరల్డ్ కప్ ట్రోఫీయే సాక్ష్యం. అందుకే.. ముంబై క్రికెట సంఘం శుక్రవారం కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది. భారత క్రికెటర్లను సీఎం ఫడ్నవిస్ సన్మానించిన సందర్బంగా ఆయనకు వినతి పత్రం సమర్పించారు ఎంసీఏ అధ్యక్షుడు అజింక్యా నాయక్.
🚨Mumbai Cricket Association president Ajinkya Naik has written to Maharashtra CM Devendra Fadnavis, seeking a plot of land to set up a dedicated residential women’s cricket academy.@shamik100 writes#BCCIWomen #CWC25 https://t.co/8IK42nrNa5
— RevSportz Global (@RevSportzGlobal) November 7, 2025
బెంగళూరులో పురుష క్రికెటర్లకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నట్టే మహిళలకు ఒకటి ఉండాలని, ముంబై మహానగరపాలక ప్రాంత (MMR) పరిధిలోనే తమకు స్థలం కేటాయిస్తే.. అక్కడ సకల వసతులతో మహిళలకు క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఒకేచోట శిక్షణ, రిహాబిలిటేషన్ వసతులు ఉంటే మహిళా క్రికెటర్లకు మరింత ఉపయుక్తంగా ఉంటుందిన ఎంసీఏ ప్రతినిధులు సీఎం ఫడ్నవీస్‌కు తెలియజేశారు. వారి అభ్యర్తన పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.
CM Devendra Fadnavis felicitated and awarded prizes to Maharashtra players who represented Team India in the ICC Women’s Cricket World Cup–winning squad, vice-captain Smriti Mandhana, Jemimah Rodrigues, Radha Yadav, along with head coach Amol Muzumdar.
मुख्यमंत्री देवेंद्र… pic.twitter.com/rSbiufjFuW
— CMO Maharashtra (@CMOMaharashtra) November 7, 2025
భారత జట్టు దశాబ్దాల కల సాకారమవ్వడంలో కీలకంగా వ్యవహరించిన మంధాన, జెమీమా, రాధాలను సీఎం ఫడ్నవీస్ ప్రత్యేకంగా ప్రశంసించారు. తమ అద్భుత ఆటతో వరల్డ్ ఛాంపియన్స్‌గా అవతరించిన ఈ ముగ్గురికి పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువాలు కప్పి సత్కరించారు. అంతేకాదు తలా రూ.2.5కోట్ల చెక్కును ప్రదాన చేశారు సీఎం. కోచ్ అన్మోల్ మజుందార్‌కు రూ.2.5లక్షల చెక్కున ముఖ్యమంత్రి అందజేశారు. టీమిండియా చరిత్ర సృష్టించడంలో భాగమైన బౌలింగ్ కోచ్ ఆవిష్కర్ సాల్వీ, సహాయక సిబ్బంది, సెలెక్టర్లు డయాని ఎడుల్జీ, విశ్లేషకుడు అనిరుద్ధ దేశ్‌పాండేలను సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, క్రీడా శాఖ మంత్రి మాణిక్‌రావు కొకటే, సాంస్కృతిక శాఖామాత్యులు అశిష్ షెలార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ ఖండరే, తదితరులు పాల్గొన్నారు.