MSK Prasad : భారత క్రికెట్ దిగ్గజం, మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad)కు ఘోర అవమానం జరిగింది. ప్రపంచ ఛాంపియన్‌గా స్వరాష్ట్రంలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి శ్రీ చరణి(Sree Charani)ని అభినందించేందుకు విమానాశ్రయం చేరుకున్న ఆయనను సిబ్బంది అడ్డుకున్నారు. శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టు(Gannavaram Airport)లో చరణికి స్వాగతం పలికేందుకు ఎమ్మెస్కే వెళ్లారు. అయితే.. సిబ్బందిఅడ్డుకోవడంతో ఆయన హుతాశులయ్యారు. ఈ వ్యవహారంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెటరన్ క్రికెటర్‌ను అడ్డగించడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులపై మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆంధ్రక్రికెట్ సంఘం సెక్రటరీ సనా సతీశ్ బాబుని సీఎం సున్నితంగా హెచ్చరించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన బాబు ఫోన్లో ఎమ్మెస్కేతో మాట్లాడారు.
ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం!#MSKPrasad #SportsUpdate #MKTelugu
More Details:https://t.co/15aw2RwM0C— MyKhel Telugu (@myKhelTelugu) November 7, 2025
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరల్డ్ కప్ గెలుపొందడంలో శ్రీ చరణి కీలక పాత్ర పోషించింది. మిడిల్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూనే వికెట్ల వేటతో పరుగులను నియంత్రించింది. ప్రపంచకప్ ఛాంపియన్‌గా స్వరాష్ట్రం తిరిగొచ్చిన చరణికి ఏపీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. దేశంతో పాటు రాష్ట్రం గర్వపడేలా చేసినందుకు రూ.2.5కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాదు ఇంటి నిర్మాణం కోసం1,000 చదరపు అడుగుల స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.
The Government of Andhra Pradesh, led by Hon’ble Chief Minister Shri N. Chandrababu Naidu Garu has announced a cash award of ₹2.5 crore, a 1,000 sq. yard house site, and a Group-I government job for Ms. Shree Charani in recognition of her exemplary performance in the ICC Women’s… pic.twitter.com/lUHpx1fHy9
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) November 7, 2025
లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన శ్రీ చరణిది కడప. చిన్నవయసు నుంచే పలు క్రీడల్లో రాణించిన తను చివరకు క్రికెటర్ అయింది. మొదట పేసర్‌గా రాణించాలనుకున్న ఆమె.. స్పిన్నర్ అవతారమెత్తింది. వరల్డ్ కప్ కోసం ఎడమచేతివాటం స్పిన్నర్ అవసరం ఉండడంతో సెలెక్టర్లు, కోచ్ మజుందార్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు చరణి వైపు మొగ్గు చూపారు. మెగా టోర్నీ ఆసాంతం గొప్పగా బౌలింగ్ చేసిన తను.. సెమీ ఫైనల్లో మూడు వికెట్లతో మెరిసింది. ఇక ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్ అన్నెకే బాష్‌ను డకౌట్ చేసింది. ప్రపంచకప్‌లో 14 వికెట్లు తీసి కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని నిలబెట్టిందీ తెలుగు తేజం.
#APWelcomesShreeCharani
Honoured to welcome Indian women’s cricket star Shree charani and former captain Mithali Raj to our residence in Amaravati. CM @ncbn Garu and I congratulated Shree charani on India’s glorious Women’s World Cup victory. Her achievement truly showcases the… pic.twitter.com/4vig1MWUj7— Lokesh Nara (@naralokesh) November 7, 2025