మాగనూరు, నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కర్ణాటక నుంచి వరి ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించేందుకు అక్రమంగా తీసుకువస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తెలంగాణ-కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు అయిన కృష మండలం వాసునగర్ చెకపోస్ట్ నుంచి రాత్రి అయితే చాలు పదుల సంఖ్యలో నిత్యం ధాన్యం లారీలు వ్యవసాయశాఖ సంబంధిత అధికారుల చేతులు తడిపి తెలంగాణలోకి చొరబడుతున్నాయి.
అయితే గురువారం అర్ధరాత్రి వాసునగర్ చెక్‌పోస్టు నుంచి ఏడు వరి ధాన్యం లారీలు చొరపడ్డాయని అందులో ఒక వరి ధాన్యం లారీని మాగనూరు పోలీసులు నల్లగట్టు సమీపంలో పట్టుకొని మాగనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించి సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు. శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధాన్యం లోడును పరిశీలించి కర్ణాటక నుంచి అక్రమంగా తెలంగాణలోకి ఎలాంటి పర్మిషన్ లేకుండా వచ్చినా అవేమి పట్టించుకోకుండా లారీని తిరిగి కర్ణాటకకు పంపించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కర్ణాటక నుంచి తెలంగాణలోకి వచ్చిన లారీని ఎలా వదిలేసారని ఎన్ఫోర్స్మెంట్ అధికారి డీటీ కాలప్పను వివరణ కోరగా తెలంగాణలోకి కర్ణాటక ధాన్యం లారీ మొదటిసారి వచ్చినందుకు ఆ లారీ యజమానిని హెచ్చరించి తిరిగి పంపించినట్లు చెప్పుకొచ్చారు