ముంబై : టీమిండియా టెస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తన ఆటకు కొత్త నైపుణ్యాన్ని జతచేశాడు.తాజాగా అతడు వికెట్ కీపింగ్ కూడా నేర్చుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై రంజీ కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ తెలిపాడు. దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీకి ముందు ముంబై నిర్వహించిన ప్రీ సీజన్ క్యాంప్, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో జైస్వాల్ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.
తీవ్ర పోటీ ఉన్న టీమిండియాలో నెగ్గుకురావాలంటే ఏదో ఒక్క విభాగంలో రాణించడం కంటే మల్టిపుల్ స్కిల్స్ ఉండటమే బెటర్ అనే యోచనలో ఈ ముంబై కుర్రాడు ఉన్నట్టు సమాచారం. ఆదివారం నుంచి ముంబై జట్టు.. తమ తొలి రంజీ మ్యాచ్‌లో చండీగఢ్‌తో ఆడనుంది. మరి ఆ మ్యాచ్‌లో జైస్వాల్.. కీపర్‌గా ఉంటాడా? లేదా? అన్నది చూడాలి.